High Tension at Osmania University

16 0 0
                                    

[http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/55854-tensions-in-osmania-university-with-student-groups-clashes.html Tensions In Osmania University With Student Groups Clashes]

ఉస్మానియా యునివర్సిటీ రణరంగమైంది. తెలంగాణ ఉద్యమం సమయంలో ఆందోళనలతో అట్టుడికిన క్యాంపస్ ఇప్పుడు విద్యార్థుల వర్గపోరుతో రగిలిపోతోంది. రెండు గ్రూపుల మద్య జరిగిన వివాదం బుధవారం అర్ధరాత్రి పెద్ద ఘర్షణకు దారితీసింది. ఓ విద్యార్థి గ్రూపు రూమును తగులబెట్టే వరకూ గొడవ వెళ్ళింది. ఈ ఘటనలో ఒక హాస్టల్ రూం మొత్తం తగులబడిపోగా.., ఒక విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలిసులు రాత్రికి రాత్రే క్యాంపస్ లోకి అదనపు బలగాలను దింపారు. హుటాహుటిన చేరుకున్న ఉన్నతాధికారులు భారీగా హాస్టళ్ళ సమీపంలో పోలిసులను మోహరించి బందోబస్తు నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ పెట్టిన చిచ్చు

వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను దశలవారీగా రెగ్యులరైజ్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమకు ఉద్యోగాలు రాకుండా పోతాయని విద్యార్థులు క్యాంపస్ లో కొద్ది రోజులుగా దీక్షలు, ఆందోళనల ద్వారా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం క్యాంపస్ లో చేపట్టిన ర్యాలికి ఓ విద్యార్థి రాలేదు. అతనిపై ర్యాలిలో ఉన్న పలువురు విద్యార్థులు దాడి చేశారు. ఈ సమయంలో విద్యార్థి సంఘం నేతలు జోక్యం చేసుకుని గొడవ పెద్దది కాకుండా చూశారు. అయితే దాడికి పాల్పడిన విద్యార్థి వర్గం ( విద్యార్థి సంఘానికి చెందిన విద్యార్థులు ) ఉండే హాస్టల్ పై ఓ విద్యార్థి సంఘానికి చెందిన కొందరు వ్యక్తులు బుధవారం అర్ధరారాత్రి దాడి చేశారు. హాస్టల్ లోని సామాగ్రిని ద్వంసం చేశారు. [http://www.teluguwishesh.com/190-andhra-headlines-flash-news/55854-tensions-in-osmania-university-with-student-groups-clashes.html Read More].....

Click here For More [http://www.teluguwishesh.com/ Latest Telangana News]

You've reached the end of published parts.

⏰ Last updated: Sep 11, 2014 ⏰

Add this story to your Library to get notified about new parts!

High Tension at Osmania UniversityWhere stories live. Discover now