ManemoniMahesh
పింకీ - ఓ చిన్నారి జీవన యాత్ర
పింకీ పేరు వినగానే ఎవరికైనా ఒక చిట్టితల్లి ముఖం గుర్తొస్తుంది. ఆమె కంటి చూపు అమాయకంగా ఉంటే, నవ్వు గుండెల్లో వెలుగులు నింపుతుంది. కానీ ఆ చిన్నారి జీవితంలో వెలుగు కన్నా చీకటే ఎక్కువ. పింకీ పుట్టిన తర్వాత కొద్ది కాలానికి ఆమె తల్లి అనారోగ్యంతో చనిపోతుంది. ఆమె తండ్రి, పరిస్థితుల దృష్ట్యా, రెండో పెళ్లి చేసుకుంటాడు. కానీ కొత్త అమ్మ పింకీపై ఎలాంటి ప్రేమను చూపించలేదు.
అంతలో, ఆమె తండ్రి పని కోసం విదేశాలకు వెళ్ళిపోవడంతో, పింకీ మరింత ఒంటరిగా మారుతుంది. రెండో తల్లి పింకీని అసహ్యించుకుని, ఒకరోజు ఇంటి నుంచి బయటికి గెంటేస్తుంది. తండ్రి దూరంగా ఉండడం, ఇంటి ప్రేమ కోల్పోవడం, చిన్న వయసులోనే పింకీ జీవితాన్ని భారం మోపింది.
ఇలా, కడుపు నిండా తినకూడకుండా, ఒంటరిగా మారిన పింకీకి తోడు ఉండేది ఒక కుక్కపిల్ల-బంటి. బంటి పింకీకి కన్నతల్లిలా