ప్రేమ మనిషికి ఉండే అంతిమ అనుభవం. ఆ అనుభవం జరిగితే మనం ఆ అనుభవాన్ని పట్టుకోలేం. ఆ అనుభవం పట్టులోనికి మనం వెళతాం. ఇక్కడ గురువుగారి మాటలకి అర్ధం అదే. ఆ అనుభవం ఆధీనంలో ఉన్నప్పుడు మనం ఏమి చేసినా అది అందమైన సంగీతంలా ఉంటుంది. వారి నుంచి వచ్చే ప్రతీ మాట ఒక కవితాగానం. ఆత్మ తేలికగా ఉంటుంది. మనం తేలుతూ ఉంటాం మన నడక నాట్యంలా ఉంటుంది. మన శరీరం తేజస్సుని వెదజల్లుతూ ఉంటుంది. మనం వెల్లడి చేసేవన్నీ మానవాళికి మనం చేసే సేవ అవుతుంది. ప్రతి వ్యక్తి ఒక ప్రేమమూర్తిగానే పుడతాడు. అప్పుడే జన్మించిన శిశువు కారణం లేని ప్రేమని వెదజల్లుతూ ఉంటాడు. అతను పుట్టినప్పుడు ఆ చుట్టు పక్కల ఉన్నవారు ఎవరైనా అతనికి తెలుసా! లేదు అతని శక్తి కారణం లేని ప్రేమ. మనం పెరిగే కొద్దీ సమాజం మనలోపల ఆశ, భయాలని నింపుతుంది. మన (పేమని ఆశ, భయాల ఆధారంగా పెంచుతాం. ఇక అది కారణం లేని పేమ కాదు. అది కారణంతAll Rights Reserved
1 part