ప్రేమ గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది
రామానుజాచార్యుల జీవితంలో ఒక చక్కని సంఘటన జరిగింది. (రామానుజులు
భారతదేశంలో ఉన్న గొప్ప తత్వవేత్త, ముగ్గురు గొప్ప హిందూ గురువులలో ఆదిశంకరాచార్యులు, మధ్వాచార్యులలో ఒకరు. ఆయన విశిష్టాద్వైతాన్ని మనకి పరిచయం చేసారు. ఆయన జీవితాన్ని పరిశీలిస్తే ప్రతి దశలో ఎదుగుతూ ఆయన ఎలా జ్ఞానోదయాన్ని పొందారో తెలుస్తుంది.
'రామానుజనికి దీక్షని ఇస్తూ ఆయన గురుదేవులు ఒక మంత్రాన్ని జపించమని చెబుతాడు. ఆ మంత్రాన్ని మరెవరికీ చెప్పవద్దని అలా చేస్తే నరకానికి వెళతావు" అని అంటాడు. అప్పుడు రామానుజులు గురువుగారిని, 'ఆ మంత్రం విన్నవాళ్ళు ఎమవుతారు"' అని అడుగుతాడు. గురువుగారు రామానుజునితో 'వారికి మోక్షం కలుగుతుంది" (జ్ఞానోదయం) అని జవాబు ఇస్తాడు. అదే మనం అయితే ఏమి చేస్తాం, ఎవరికీ చెప్పకుండా ఉండిపోయేవాళ్ళం. ఎందుకు అనవసరంగా నరకానికి వెళ్ళటం అన