ప్రేమ మీ అంతరాత్మను పూర్తిగా వికసింప చేస్తుంది
మీరు లోతైన ప్రేమతో ఉన్నప్పుడు, మీ అంతరాత్మ మొత్తం విప్పారి ఉంటుంది. అప్పుడు మీరు ఎటువంటి దానికోసం ఎంత దూరమైనా వెళ్ళి సాధిస్తారు. దానికోసం మీరు అవకాశం అంచులవరకు వెళ్ళగలుగుతారు. మీ అంతరాత్మని రక్షించుకోవలసిన అవసరం ఉండదు. మీ అంతరాత్మ పూర్తిగా వికసించి ఉంటుంది. మీరు ఆ ప్రేమతో నిండినప్పుడు రక్షణ గురించి అనుకోరు. అందుకే ప్రేమతో ఉన్నవారు ఎంత కష్టమైన పనినైనా చేస్తారు. వారు ఎంత
కష్టాన్నైనా తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ వారు పోగొట్టుకోవటానికి ఏమీ ఉండదు. ఏ విషయంలో కూడా అభద్రతా భావం ఉండదు. ఎందుకంటే (ప్రేమ అంతులేని ధైర్యాన్ని శక్తిని ఇస్తుంది. అది మీరు వికసించే విధంగా చేస్తుంది. మీకు మీరు దొరికే విధంగా చేస్తుంది. ప్రస్తుతం మీకు మీరు దొరికే స్థితిలో లేరు. ప్రేమ మీకు మీరు దొరికే విధంగా చేస్తుంది.
భగవాన