అహం ముడుచుకుపోయిన చేతన స్థితి పరమానంద స్తితిలో ఉండాలంటే ఆ సాగరం లో కరిగిపోవాలి.అంతేకానీ నీటిబొట్టులా ఉండకూడదు. అందులో ఐక్యమైపోవాలి. నీటి బొట్టుని అనుకుంటే అది అహం. మనలో ఉండే అన్ని వ్యథలకి కారణం అహం. మనలో అహం పోగానే సాగరం అనే విశ్వశక్తి నలుమూలల నుంచి మనని చేరుతుంది. అది ఎలా ఉంటుందటే అహం మాయమవటానికే చూస్తున్నట్టుగా ఉంటుంది. అహం ముడుచుకుపోయిన చేతన స్థితి. కిటికీలు, తలుపులు అన్నీ మూసుకుపోయి ఉంటాయి. అప్పుడు జీవితం ప్రత్యేకంగా వేరు చేయబడి, పొరలతో కప్పబడిపోయి ఉంటుంది. అహం మూత వేయబడిన కోశం లాంటిది. అందులోనికి ఏదీ వెళ్ళలేదు. భయంతో మూతవేసుకొని ఉంటుంది. దాని లోనికి అది ముడుచుకు పోతుంది. ఈ విధంగా చేస్తూ మనకి మనం సమస్యలని, వ్యథని సృష్టించుకుంటాం. ప్రేమ విశ్వశక్తితో ప్రవహిస్తూ, సంపూర్ణంగా విశ్వశక్తితో ఉంటుంది. అహం గడ్డగట్టిన ఐసుగడ్డ లాంటిది. పSeluruh Hak Cipta Dilindungi Undang-Undang