మనిషి సృష్టి లయల నుంచి ఎందుకు బయటకి వచ్చాడు
మనస్సు అహంలో భాగం. దానికి ఏ విధంగా మూసిఉండాలో తెలుసు కాని ఎలా
విప్పారాలో తెలియదు. ప్రేమించటం అంటే విప్పారి ఉండటం, ఆధీనమవటం. అంటే విశ్వసృష్టికి విప్పారి ఉండటం, పూలకి, తేనెటీగలకి నక్షత్రాలకి అన్నింటికీ విప్పారి ఉండటం. సర్వసృష్టిలో ఉన్న అందమయిన సంగీతానికి మనం ఏవిధంగా విప్పారి ఉండగలం? చుట్టూ నిరంతరం జరుగుతుండే ఉత్సవాలకి మనం ఏవిధంగా విప్పారి ఉండగలం? మలయవీచికలకి నాట్యం చేసే సుమాలు, మలయమారుతాలతో ఆనందం పొందే వృక్షాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏ విధంగా
ఆనంద స్థితిలో ఉండగలుగుతున్నాయి. మనిషి తప్ప అంతా సృష్టికి అనుగుణంగా సాగిపోతున్నాయి. ఒక విషయం అర్ధంచేసుకోండి; మనిషి సృష్టి లయల నుంచి ఎందుకు బయటకి వచ్చాడు అంటే అతనిలో చేతన స్థితి ఉన్నది. అది మిగిలిన జీవరాసులలో లేదు.
భగవాన్ నిత్యానంద పరమశివం గారి పుస్తకములన