ఆలోచనలనుంచి ఎలా బయటకి వెళ్ళాలి
అంతరాత్మపొందే ఆనందపు అనుభూతిని తెలుసుకోవటానికి మనలో సున్నితత్వం ఉండాలి. ఆ అనుభూతి ఉండాలి. అదే ప్రేమ అంటే. అలా ఉండే ఆనందాన్ని అనుభవించటమే ప్రేమ. ఆ విధంగా ఉన్నప్పుడు జీవితం అంటే ఎదో కొన్ని స్వతంత్రమైన ఆలోచనలు కాదు, అది నిరంతరం ఉండే ఒక అనుభూతి అని తెలుస్తుంది. అప్పుడు అహం కరగటం మొదలుపెడుతుంది. ఒకసారి
మనం ఆలోచనలనుంచి అనుభూతికి మారగలిగితే, అక్కడినుంచి అంతరాత్మని చేరటానికి మరొక మెట్టుమాత్రమే ఉంటుంది. అది చాలా సులభం.
ఇందులో మొదటి దశ కష్టం. అది ఆలోచనల నుంచి అనుభవం వైపు వెళ్ళటం. అహం ఆలోచనలు ఎక్కువగా ఉండే విధంగా శిక్షణ ఇస్తుంది. ఈ దశ దాటాక రెండవది ఆటోమేటిక్‌గా వస్తుంది. అది జరగటానికి మనం ఏమీ చేయనవసరం లేదు. అనుభవం నుంచి అంతరాత్మలోనికి దూరం ఉండదు. అది ఎప్పుడైనా జరగవచ్చు. కవి ఏ నిమిషంలోనైనా యోగిగా మారవచ్చు.యోగి అక్క