మీరు సర్వసృష్టి పట్ల గౌరవం, ప్రేమతో ఉంటె, అందులోని ప్రతిది మీలో మీకు కనిపిస్తుంది.
మీరు సర్వసృష్టి పట్ల గౌరవం, ప్రేమతో ఉంటె, అందులోని ప్రతిది మీలో మీకు కనిపిస్తుంది. మీరు చూపించే ప్రేమకి ప్రకృతి అందంగా స్పందిస్తుంది.
ప్రేమ, గౌరవం వేరు చాలాసార్లు ప్రేమని గౌరవం అనుకుంటారు. పిల్లల్ని చిన్నతనం నుంచి పెద్దవారిని గౌరవించాలని నేర్పిస్తారు కాని ప్రేమించాలని చెప్పరు. మీరు వింటుంటారు కదా! 'పెద్దవారిని గౌరవించండి" అని చెప్పటం కానీ 'పెద్దవారిని ప్రేమించండి అని చెప్పటం మీరు వినరు. అదే సమస్య, గౌరవం అనేది మీలోపల మీరు తక్కువ వారు అనే భావానికి విత్తనం వేస్తుంది. మీరు గౌరవం చూపించే వ్యక్తి వేరు, మీరు వేరు అని మీరు అనుకునేలా చేస్తుంది. అదే ప్రేమ మీలో ఆనందం, ఐక్యమవ్వటం అనే విత్తనాన్ని నాటుతుంది. ( మీరు ప్రేమించే వ్యక్తితో చక్కని అనుబంధాన్ని ఏర్పరుస్తుంది.