జలాలుద్దీన్ రుమి అనే సూఫీ యోగి ఈ విధంగా చెబుతాడు, 'మీరు ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నిరంతరం (ప్రేమికునిలా ఉండండి సృష్టి సర్వం తనమీద తాను లోతయిన, అందమయిన ప్రేమలో ఉంటుంది. మీరు అందులో భాగమె. కాబట్టీ (పేమికునిగా ఉండటం అనేది మీ సహజ లక్షణం. ఆవిధంగా ఉంటూ మాత్రమే మీరు నిజమైన పరిపూర్ణతని సాధించగలరు. ముందుగా మిమ్మలని మీరు ప్రేమించండి ఈ రోజులలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే వారినివారు ప్రేమించలేకపోవటం. సమాజం మననిమనం ప్రేమించగలం అని నేర్పించదు. ఒక విషయం అర్ధం చేసుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేనప్పుడు ఎదుటి వారిని ప్రేమించలేరు. మీ ప్రేమలో మిమ్మల్ని మీరు మరచిపోతే, ఎదుటివారి ప్రేమలో కూడా మిమ్మల్ని మీరు కోల్పోగలుగుతారు. మనకి ఏమని నేర్పిస్తారంటే ఏదో కారణం ఉంటేనే మనని మనం ప్రేమించచగలుగుతాం. మనం ఏదైన సాధిస్తే మనని మనం ప్రేమించగలం. అపజయం పొందితే మనన