కల్పనా చావ్లా... ఈ పేరు వినగానే ఎవరికైనా అంతరిక్షము గుర్తొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచింది. మరీ ముఖ్యంగా ఆమె జీవితం మనకి ఒక గొప్ప పాఠం. కలలు కనడమే కాదు వాటిని ఎలా సాకారం చేసుకోవాలి అనేది కల్పనను చుస్తే అర్ధమౌతుంది. అంతరిక్షంలోకి వెళ్లిన మొట్టమొదటి భారతీయ మహిళ కావడం అందులోనూ నాసా తరుపున వెళ్లడం మనందరికీ గర్వకారణం. కానీ ఆమెకు నాసాలో ఛాన్స్ అంత ఈజీగా రాలేదు. కల్పనా చిన్నప్పటినుండీ చుక్కలను చూసి పట్టుకోవాలని, ఆకాశంలో తిరగాలనీ కలలు కనేదట. కానీ ఎలా అనేదే ఆమెకు తెలీదు తెలిసిందల్లా చదువుకోవడం. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉంటే అంతరిక్షయానం చేయొచ్చని నమ్మింది. అందుకోసమే తాను ఇంరెస్ట్ కూడా అటువైపుగా అడుగులేసేలా చేసింది. కల్పనా చావ్లా 1962 మార్చి 17 న హర్యానాలోని కర్నల్ లో జన్మించింది. తల్లిదండ్రులు మధ్యతరగతికి చెందిన వార