కవిత తప్పు చేయనప్పుడు CBI, ED వస్తే ఎందుకు భయపడుతున్నారని బీజేపీ నేత డీకే అరుణ ప్రశ్నించారు. బీజేపీపై కావాలనే ఎదురుదాడి చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల సానుభూతి పొందేందుకే కల్వకుంట్ల కుటుంబం ప్రయత్నిస్తోందని అన్నారు. చేసిన అవినీతికి కవిత జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. తెలంగాణ కోసం ఆమె జైలుకి వెళ్తున్నట్టు ఆమె మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.All Rights Reserved