4 parts Ongoing ఆశలు, అడియాసలు
సంతోషాలు, బాధలు
నిరాశలు, నిస్పృహలు
ఎత్తు పల్లాలు,
బ్రతుకు సమరం లో ఒడిదుడుకులు
కొత్తగా పుట్టుకొచ్చే రోగాలు
ఎవరి మీద ఎవరి గెలుపుకో తెలియని యుద్ధాలు
ఇంత అనిశ్చితిలోనూ, ఆగని మనిషి పరుగులు
ఆపలేని మార్పులు, తీరని కోరికలు
అంతమైపోయాయి అనుకొనే ఎన్నో కథలు
అనుకోని ప్రారంభాలకి తీస్తాయి కొత్త ద్వారాలు
ఏ దేవుడు క్షమించలేని పాపాలు
మనం చేస్తూనే పెడతాం ఇతరులకు శాపాలు
ఇవే, మన జీవితాలు,
"గాలి లో దీపాలు"