భావనారాయణ స్వామివారి పేరు మీదుగా జిల్లాకు పేరు పెట్టబడిందని తెలుస్తోంది. మొదటిలో భావపురిగా పిలువబడిన ఈ ప్రాంతం తరువాత భావపట్ల అనంతరం బాపట్లగా మారింది. అయితే 1977 సంవత్సరంలో కమ్యూనిస్ట్ నేత కొల్లా వెంకయ్య జిల్లా ఏర్పాటు ప్రతిపాదన చేశారు. తరువాత 2022 ఏప్రిల్ 4న ప్రకాశం జిల్లా మరియు గుంటూరు జిల్లాలోని ప్రాంతాలతో బాపట్ల ప్రత్యేక జిల్లాగా ఏర్పాటైంది. 1794 లో బాపట్ల తాలూకా ఏర్పాటైంది. 1919లో ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నేతృత్వంలో నిర్వహించిన చీరాల -పేరాల ఉప్పు సత్యాగ్రహ ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత సంతరించుకుంది. దక్షిణ భారత్ లోనే మొట్టమొదటి వ్యవసాయ కాలేజ్ 1945 జూలై 11న బాపట్లలో ప్రారంభమైంది. అంతేకాకుండా బీపీపీ-8 రకం జీడిపప్పును అభివృద్ధి చేసిన జీడిపప్పు పరిశోధనా కేంద్రంతో పాటు బీపీటీ -5204, సాంబమసూరి వరి రకాల అభివృద్ధి బాపట్లకు మరింత గుర్