ఊహల పల్లకిలో

1 0 0
                                    

ట్రాఫిక్ సిగ్నల్ పడగానే బైక్ ఆపాను,చుట్టూ ట్రాఫిక్ ఓ దిక్కు మండుటెండ ఇంత ట్రాఫిక్ లో నేను నా గమ్యానికి చేరుకోగలన అని నా మెదడుకి కంగారు,ఇంతలో ఎవరో పిలుస్తున్నట్టు అనిపివ్వగా ఈ లోకం లోకి వచ్చాను.చెల్లి అరుస్తుంది అన్నయ్యా!అన్నయ్యా!! గ్రీన్ సిగ్నల్ పడింది బైక్ స్టార్ట్ చెయ్యి అని, అలా నా "royal Enfield" ని స్టార్ట్ చేశాను. ఇంట్లో ఎంతో గొడవ పడితే కానీ నా చెంత కి చేరలేదు ఈ బండి.చెల్లికి ఇంటర్ పరీక్షలు ఎగ్జామ్ సెంటర్ కి తీసుకెళ్లడం,తీసుకురావటం నా వంతు ఏ పని పాట లేనిది నా ఒక్కడికే అని మా నాన్న గారు నాకిచ్చిన డ్యూటీ ఇది, మా చెల్లి పేరు మాన్విత.ఇంటికి వెళ్ళే సరికి మా అక్క ను చూడటానికి ఆల్రెడీ పెండ్లి వాళ్ళు వచ్చి వున్నారు,నేను వెళ్లి అబ్బాయి పక్కన కూర్చున్న అబ్బాయి అంటే ఎవరో కాదండోయ్ మా అక్కకి నచ్చితే కాబోయే బావ గారు అదండీ ముచ్చట.
                                     ***
మా అక్క పేరు మధుబాల తన గురించి చాలా చెప్పాలండోయి,తనకు ఆదర్శాలు చాలా ఎక్కువ ఈ కాలంలో ఉండాల్సింది కాదండోయ్ మా అక్క ఏం చేస్తాం సర్దుకుపోవడం తప్ప.
మా అమ్మ వాళ్ళ కోసం చేసిన టిఫిన్స్ టేబుల్ పై ఉంచింది నాకు అవి తినాలి అని ఉన్నా వాళ్ళ ముందు తీసుకో కూడదు అని ఊరుకున్న.అబ్బాయి వాళ్ళ నాన్న గారు మా నాన్న కేసి చూశారు అమ్మాయిని పిలిపించండి అన్నట్టు.మా నాన్న వస్తుందండీ రెడీ అవుతుంది అన్నారు,కాని నిజానికి మా అక్క రెడీ అవ్వట్లేదు తను తన వర్క్ లో చాలా బిజీ గా ఉంది నేను వెళ్ళాను అక్క దగ్గరకి అక్క పద అందరూ ఎదురుచూస్తున్నారు నీ కోసం అని.ఏరా!! వచ్చావ వెయిట్  చెయ్యని వాళ్ళని చూద్దాం ఎంత సేపు ఉంటారో అని అంది,అక్కా... నీ మొఖమే వాళ్ళు ఎం జాబ్ ఇంటర్వ్యు కి రాలేదు నిన్ను చూడటానికి వచ్చారు అని అన్న, దానికి అక్క తెలుసు లేరా నాకు అయినా నా సంపాదన నాకు ఉండగా మధ్యలో అతను ఎందుకు అని అంది. ఏమో!!! అక్కా.... నాకు అవి ఏం తెలీదు నువ్వే వచ్చి మాట్లాడుకో అని అన్నాను.
                                    ***
అక్క డైరెక్ట్ గా అబ్బాయి దగ్గరకి వెళ్ళింది ఒకే ఒక ప్రశ్న వేసింది,నికు పెండ్లి ఎందుకు కావాలి?? అని,అంతే వాడు ఆశ్చర్యపోయాడు,మాకు అలవాటే కాబట్టి చూస్తూ వున్నాం మా చెల్లే నేను.ఈమెకి ఏం అయిన పిచ్చా...!!!పెండ్లి ఎందుకంటది,నేను ముందు నుంచి మొత్తుకుంటున్న  నాకు నచ్చలేదు అని మీరు తీసుకువచ్చారు అని వాళ్ళ అమ్మానాన్నల పై అరిచాడు ఆ అబ్బాయి.ఇక ఈ ప్రపోజల్ కూడా గోవిందా!గోవిందా!! మాన్విత,నేను వాళ్ళ కోసం చేసిన టిఫిన్స్ ని హాయిగా ఆరగించాము.
మా అమ్మ అందుకుంది,ఏమే... నీకెందుకే అంత పొగరు ఒక్క మాటలో ప్రపంచాన్నే జయించినట్టు ఫీల్ అవుతావు ఏం కావాలి నీకు నీ తర్వాత ఇద్దరు ఉన్నారు అది తెలుస్తుందా...... నీకు అని అంది.దానికి అక్క,తెలుస్తుంది అమ్మ అతన్ని అడిగిన ఈ చిన్నదానికి సమాధానం చెప్పటం లేదు రేపు ఏదైనా ప్రాబ్లం వచ్చిన గొడవ అయిన ఫేస్ చేయగలడా అని అంది.నీ పిచ్చి ప్రశ్నల కు ఏవ్వరు ఏం సమాధానం ఇవ్వరు,నేను బ్రతికి ఉండగా నీ పెండ్లి కాదు అని తల కొట్టుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయింది.నాన్న అన్నారు తల్లీ నీ ఇష్టం రా కాని నువ్వు ఎలాంటి వాడిని చేస్కుంటావో చెప్పురా అని దానికి అక్క నేను అడిగిన చిన్న ప్రశ్నకి ఎవ్వరు  సమాధానం ఇచ్చిన వారిని చేసుకుంటా అని అంది. మాన్విత,నేను నవ్వుకున్నాం దీనికి జన్మలో పెండ్లి కాదు అని.
ఇంతకీ మా అక్క ఏం చేస్తుందో చెప్పలే కదా మా అక్క  మేము చదివిన స్కూల్ లో నే టీచర్ అనే పాత్ర కి న్యాయం చేస్తూ ఉంటుంది.ఇక మా చెల్లి చిన్నది అయ్యే సరికి గారాబం ఎక్కువ ఏం కావాలి అన్నా ఇవ్వాల్సిందే పోయిన సారి తన బర్త్డే కి వాళ్ళ ఫెండ్స్ తో కలిసి అది వైజాగ్ బీచ్ చూసి వస్తా అని పోయింది వారించి మరి ఏం అన్న అంటే బెవర్స్ గా తిరిగే అన్నయకి అన్ని చేస్తారు నాకు చెయ్యరా అని నన్ను లాగుతది,నువ్వు చిన్న పిల్లవే అంటే వినదు మొండిఘటం.
అలా అని నన్ను మీరు కూడా బెవర్స్ అనుకోకండి టెన్త్ లో  10GPA ఇంటర్ లో 98% యూనివర్సిటీ లో 72% వచ్చిందండి,నాకు పిహెచ్.డి చెయ్యాలి అనేది డ్రీమ్ అందుకే మంచి యూనివర్సిటీ లో చదువుదాం అని ప్రిపేర్ అవ్తున్న ఎంటెక్ కి.
                                   ***
మా అమ్మ హౌజ్ వైఫ్,నాన్న రిటైర్డ్ జడ్జి పేరు మణిభుషన్,అమ్మ పేరు ఊర్మిళ.నాకు ఎక్కువ సమయం ఫ్రెండ్స్ తో గడపడం ఇష్టం అలా అని నా స్టడీ నీ దూరం చేసుకునేది కాదు.నా స్టడీ కి ఏది అడ్డు వచ్చిన చాలా సీరియస్ గా ఉంటా అండి నేను అది మ్యాటర్ అండి.సింపుల్ గా నా ప్రపంచం లో బిజీగా ఉంటా అండి లేకుంటే గోల్ రీచ్ కాలేను.
నేను సాయంత్రం అలా బయటికి వెళ్లి డిన్నర్ టైమ్ కి రాగానే అందరూ తినడానికి కూర్చున్నారు మా ఇంట్లో ఏవ్వరింట్లో లేని అలవాటు ఉందండోయ్....అందరం కలిసే తింటాం ఇంత బిజీగా ఉండే జీవితం లో కలిసి తినడం నాకు అస్సలు నచ్చదండి అయినా ఈ కాలంలో ఎవ్వరు ఉంటారు మా ఇంట్లో ఉన్నట్టు,కానీ ఎం అనలేను ముందు నుంచి ఉన్న పద్దతి అని.మా అక్క వాళ్ళ స్కూల్ లో జరిగిన విషయం చెప్పసాగింది మాకు,ఓ పిల్లాడు పాఠం చెప్పంగా అల్లరి చేస్తుంటే లేపిందట ఏరా ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని దానికి వాడు ఎం లేదు మేడం మీరు ప్రతి శుక్రవారం ఒక సోషల్ అవరెనేస్ టాపిక్ చెప్పి ఓ ప్రశ్న వేస్తారు కదా అలా నిన్న ఒక ప్రశ్న అడిగారు కదా దానికి సమాధానం తెల్సు అన్నాడు, దానికి అక్క అందంట అవును నేను మర్చిపోయారా చెప్పు నికు ఏం తెల్సో అని అడిగిందట మళ్లీ ఒకసారి ప్రశ్న గుర్తు చేసింది అందరికీ."ఓల్టేజ్ హోమ్స్ ఉండకుండా ఉండాలి అంటే ఎం చేయాలి"? అని దానికి ఆ పిల్లాడు అద్భుతమైన సమాధానం ఇచ్చాడు,మేడం ప్రతి ఒక్కరూ ఉద్యోగాన్ని ఎంత ఇష్టపడతారో తల్లితండ్రులను అంతే ఇష్టపడాలి,ప్రతి ఒక్క కోడలు తల్లితండ్రులను  ఎంత ప్రేమిస్తుందో అత్తమామలను అంతే ప్రేమించాలి అని.వాడు చదివేది నాలుగో తరగతి వాడికి ఉన్న తెలివి కూడా ఈ లోకం లో కొందరి ఆఙ్ఞానులకు  లేదని అక్క వాపోయింది, "మారాలి లోకం రావాలి ప్రజల్లో చైతన్యం" అని అక్క మళ్లీ నినాదాలు మొదలెట్టే సరికి మా తిండి అయిపోయింది చెళ్లే,నేను నవ్వుకున్నాం ఇపుడు ఇలానే అంటావ్ కానీ నీ పెండ్లి అయ్యాక నువ్వు అందరిలా ఉంటావేమో ఎవరికి తెల్సు అని.దానికి అమ్మ ఆపండి రా మీ కాకి గోల అని అరిచింది.నాన్న కూడా అక్కకి వత్తాసు పలుకుతూ నా కూతురు బంగారం అలా ఎం చేయదు అది అన్నారు.
                                      ***
నా GATE ఎగ్జామ్ కి ప్రిపేరేషన్ ఆల్మోస్ట్ అయిపోయింది తెల్లారితే ఎగ్జామ్.
                                *___*___*
ఇంకో 5 నిమిషాల్లో ఎగ్జామ్ సెంటర్ కి చేరుకుంటా అనే లోపు ఫోన్ కాల్ వచ్చింది నాన్న కాల్ చేశారు అమ్మకి గుండెపోటు వచ్చింది అని నాన్న,అక్క తీసుకెళ్తారు లే అమ్మని నాకు ఎగ్జామ్ ముఖ్యం అమ్మ కూడా నేను ఎగ్జామ్ రాయడమే కరెక్ట్ అంటది అని,నాన్న పూర్తిగా చెప్పే లోపే మీరు హాస్పిటల్ కి తిస్కెళ్ళండి ఎగ్జామ్ రాసి వస్తా అని అన్నాను.చాలా వరకు నేను ప్రాక్టీస్ చేసినవే వచ్చాయి.ఎగ్జామ్ అయిన వెంటనే నాన్నకి కాల్ చేసాను స్విచ్ ఆఫ్ వచ్చింది అక్క కి కాల్ ట్రై చేసా బిజీగా ఉండటం తో ఇంటికి వెళ్ళాను ఇంటి నిండా జనాలు ఏడుపులు,ప్రస్తుతం ఏం అయిందో నేను చెప్పలేను మీరే అర్థం చేసుకోండి నేను భాధలో ఉన్న అస్సలే నాన్న అన్నారు ఫోన్ లో చెప్పేది పూర్తిగా వినవా నువ్వు ఎంత సేపు నీ గోల్ అనే కలవరిస్తావ నువ్వు అమ్మ కి గుండెపోటు ఇది మూడోసారి రావటం డాక్టర్ వచ్చాడు చూసాడు డాక్టర్ వెళ్ళిన వెంటనే కన్ను మూసింది మీ అమ్మ అది చెప్పోలోపే హాస్పిటల్ కి వెళ్ళండి అని సలహాలు ఇస్తావా నువ్వు అని అన్నారు.అక్క అయితే మాట మాట్లాడటం లేదు ఎన్నో సార్లు తోడుగా ఉన్న అక్క ఈ సారి మాట కూడా లేదు మాన్విత ఒక్కతే నాకు సపోర్ట్ గా ఉంది అన్నయ్య పై ఎందుకు అరుస్తున్నారు అన్నయ్యకి తన గోల్ ముఖ్యం పోయిన అమ్మ కోసం అన్నయ్య లైఫ్ కరాబ్ ఎందుకు చేసుకోవాలి అని ఇంతలో మా అమ్మమ్మ వచ్చి ఇది గొడవపడే సమయం కాదు ముందు జర్గాల్సినవి చూడండి అని అంది.
                  నెల రోజులు గడిచే సరికి నేను అనుకున్నట్టు గా మంచి యూనివర్సిటీ లో సీట్ సంపాదించ తమిళనాడులో,చెల్లె కూడా బిటెక్ మా కాలేజ్ లో నే జాయిన్ అయ్యింది. అక్క కి మధ్యలో చాలా సంబంధాలు వచ్చిన అక్క ప్రశ్నకి ఎవరు సమాధానం చెప్పకపోవడం తో ఏది సెట్ కాలేదు దానికి జన్మలో పెండ్లి కాదు లెండి.ఇంట్లో వాళ్ళకి చాలా జాగ్రత్తలు చెప్పి నేను యూనివర్సిటీ లో జాయిన్ అయ్యాను.చూస్తుండగా రెండేళ్ళు గడిచాయి ఫైనల్ ప్రాజెక్ట్ చేస్తుండగా నాకు అనుకున్నట్టు గానే పెద్ద కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యు కి పిలిచారు మీకు కంపెనీ పేరు చెప్పాలి కదా మర్చిపోయాను అమెజాన్,సెలెక్ట్ అయ్యాను ఇంటర్వ్యు లో మంచి పొజిషన్.ఒక సారి ఇంటికి వెళ్లి వద్దాం ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యేలోపు అని అనుకుంటున్న నాన్న కాల్ చేశారు మాన్విత కనపడట్లేదు రా నిన్నటి నుంచి అని......................................
 

            TO BE CONTINUED IN PART TWO

stay tuned guys😊




           


               

You've reached the end of published parts.

⏰ Last updated: Dec 17, 2020 ⏰

Add this story to your Library to get notified about new parts!

ఊహల పల్లకిలోWhere stories live. Discover now