మనం ముందుగా మనందరికీ తెలిసిన ప్రేమ గురించి అంటే సకారణమైన ప్రేమ గురించి తెలుసుకుందాం. మీకు ఆధారమైన వ్యక్తికి, మీకు పేరు ప్రతిష్టలు తెచ్చే వ్యక్తికి మాత్రమే మీ ప్రేమని పంచుతారు. ఇటువంటి ప్రేమ కూడా మీలోని అస్థిరత్వాన్ని, అసహనాన్ని బాగు చేయగలుగుతుంది. మీలో కలిగే అసహనం ముందుగా మీ పరిస్థితుల వల్ల ఏర్పడుతుంది. కొన్ని సార్లు, కొన్ని సందర్భాలలో, కొన్ని స్థలాలలో మీరు అస్థిరంగా, అసహనంగా ఉంటారు. మీరు ఆ సందర్భం నుంచి, ఆ చోట నుండి బయటకు రాగానే విశ్రాంతిగా, స్థిరంగా అవుతారు. మీకు అసౌకర్యం కలిగే స్థితిలో ఎవరైనా మీ పట్ల ప్రేమని, శ్రద్ధని చూపించారనుకోండి లేదా మీరు ఎదుటి వారి పట్ల ప్రేమని, శ్రద్ధని చూపించారనుకోండి అప్పుడు మీరు ఆ కంగారు నుంచి బయట పడి విశ్రాంతిగా ఉండగలుగుతారు. భగవాన్ నిత్యానంద పరమశివం గారి పుస్తకములను దర్శించండి. Books: www.Books.nithyananda.org వారి యొక్క