ఒక క్లాసులో టీచర్ ఒక అబ్బాయి దిగులుగా కూర్చొని ఉండటం చూసి అతన్ని "ఏమి జరిగింది, ఎందుకు బాధ పడుతున్నావు" అని అడుగుతుంది. టీచర్ ప్రశ్నకి ఆ అబ్బాయి, "నా తల్లితండ్రులు నాకు మంచి బట్టలు, మంచి చదువు ఇవ్వటానికి చాలా కష్టపడి రోజంతా పని చేస్తారు. నేను ఏది అడిగితే అది కొని ఇస్తారు. మా అమ్మ నాకు మంచి భోజనం తయారు చేసి పెడుతుంది నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది అని జవాబు ఇస్తాడు. అప్పుడు టీచర్, 'మరైతే నీవు ఎందుకు బాధ పడుతున్నావు? అసలు నీ సమస్య ఏమిటి?" అని తిరిగి అడుగుతుంది. అప్పుడు ఆ అబ్బాయి, 'వాళ్ళు పారిపోతారేమో అని భయంగా ఉన్నది" అని జవాబు ఇస్తాడు.