A Producer Filed Pitition In Madras High Court To Stop Lingaa Movie

6 0 0
                                    

A Producer Filed Pitition In Madras High Court To Stop Lingaa Movie తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ తాజా చిత్రం 'లింగా'కు కోర్టు కష్టాలు తప్పవని తెలుస్తోంది. షూటింగ్

పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ప్రదర్శించకుండా నిలిపివేయాలంటూ మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ లో పిటిషన్ దాఖలైంది. రవి రతినం అనే నిర్మాత ఈ పిటిషన్ దాఖలు చేశారు. 2013లో వచ్చిన తన సినిమా 'ముల్లం వనమ్

999' స్టోరీ లైన్ 'లింగా' స్టోరీ లైన్ ఒకటే అని పిటిషన్ లో చెప్పారు. తన అనుమతి లేకుండా తన సినిమాలోని స్టోరీ లైన్ తో మరో సినిమా చేయటం నేరమని చెప్పారు.

కాబట్టి లింగా సినిమాను ప్రదర్శించకుండా నిలిపివేయాలని పిటిషనర్ హైకోర్టు బెంచ్ ను కోరటం జరిగింది. సినిమా విడుదల కోసం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న తరుణంలో ఇఫ్పుడిలా పిటిషన్ దాఖలు కావటంతో సినిమా యూనిట్ షాక్ అయినట్లు

తెలుస్తోంది. ఈ పిటిషన్ పై కోర్టు ఎలా స్పందిస్తుంది అనేది పక్కనబెడితే.., ఇప్పుడు ఏం చేయాలి అని డైరెక్టర్, నిర్మాత ఇతర యూనిట్ సభ్యులు చర్చలు జరుపుతున్నట్లు కోలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. అటు ఈ పిటిషన్ తో సినిమా విడుదలపై రజిని అభిమానుల్లో

ఆందోళన వ్యక్తం అవుతోంది. అటు పిటిషన్ వేసిన నిర్మాత రవిపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రజినీకాంత్ హీరోగా నటించిన 'లింగా' సినిమాను కే.ఎస్. రవికుమార్ డైరెక్ట్ చేశాడు. రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సినిమా వస్తోంది. వెంకటేష్ నిర్మాతగా వ్యవహరించగా రహమాన్ సంగీతం అందించాడు. అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్లుగా నటించిన ఈ

సినిమా రజినీకాంత్ పుట్టినరోజు సందర్బంగా డిసెంబర్ 12న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇంతలో కోర్టులో పిటిషన్ దాఖలు కావటంతో కలవరం మొదలైంది. మరి కోర్టు ఎలా స్పందిస్తుంది.., సినిమా యూనిట్ ఏం చేస్తుంది అనేది ఉత్కంఠ రేపుతోంది.

For More Latest Updates about Telugu News, Movie News, Gossips, Reviews and Gallery Logon to teluguwishesh.com

You've reached the end of published parts.

⏰ Last updated: Nov 13, 2014 ⏰

Add this story to your Library to get notified about new parts!

A Producer Filed Pitition In Madras High Court To Stop Lingaa MovieWhere stories live. Discover now