Latest
Baahubali Movie Making సినిమాలు తీయటంలోనే కాదు.., ట్రైలర్లు, టీజర్లు, ఫొటోల విడుదలలో కూడా రాజమౌళిది ఓ ప్రత్యేకత. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న పిరియాడికల్ ప్రాజెక్టు 'బాహుబలి' మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ముంబై
కామిక్ కాన్ ప్రత్యేకంగా విడుదల చేసిన ఈ వీడియోలో సినిమా కోసం పడుతున్న కష్టాన్ని చూపించారు. ఫొటోలు, ప్లాన్లు, షూటింగ్ కోసం చేసిన గ్రౌండ్ వర్క్, భారీ సెట్టింగుల రూపకల్పన, కళాకారులు కష్టపడ్డ విధానం అన్నీ వీడియోలో చూపించారు. ఈ వీడియోకు
కీరవాణి అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది.
సినిమా షూటింగ్ మొదలు పెట్టి రెండు సంవత్సరాలు కావటంతో.., ప్రేక్షకులు మూవీని మర్చిపోకుండా అప్పుడప్పుడూ ఇలా మేకింగ్ వీడియోలు, తారల ఫొటోలు, వీడియోలతో పలకరిస్తున్నారు. ఇది రాజమౌళి మార్కు మార్కెట్ స్టంట్ అయినా ఫ్యాన్స్ కు మాత్రం
వీడియోలు, ఫొటోలు వచ్చినప్పుడు పండగే. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.., రానా ప్రధాన విలన్ పాత్రను పోషిస్తున్నాడు. అనుష్క, తమన్నా ఈ మూవీలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. అర్కా ప్రొడక్షన్స్ బ్యానర్ పై
తెరకెక్కుతున్న సినిమాను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని కలిసి నిర్మిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా తొలి పార్ట్ 2015 ఏప్రిల్ లో విడుదల చేయనున్నారు. తమన్నా పుట్టినరోజు సందర్బంగా ఆదివారమే మూవీ యూనిట్ సినిమాలో ఆమె
ఫొటోను విడుదల చేసింది.
అత్యధిక కాలం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాగా రికార్డు క్రియేట్ చేసిన 'బాహుబలి' షూటింగ్ ప్రస్తుతం బల్గేరియాలో జరుగుతోంది. పలు ఫైట్ సీన్లతో పాటు.., కీలక సన్నివేశాలు ఇక్కడ షూట్ చేస్తున్నారు. అటు ఇదే సమయంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్
పనులు కూడా జరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయి గ్రాఫిక్స్ టెక్నాలజీ వాడుతున్నారు. ఇందుకోసం ప్రపంచస్థాయి నిపుణులు ప్రాజెక్టులో పనిచేస్తున్నట్లు మూవీ యూనిట్ తెలిపింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందో చూడాలి.
Click here for [http://www.teluguwishesh.com Latest Telugu Movie News, Tollywood Movie Reviews and Telugu Gossips]
![](https://img.wattpad.com/cover/28933941-288-k7e6da1.jpg)