Rudramadevi Release Postponed

13 0 0
                                    

Rudramadevi Release Postponed To Sankranti 2015 అనుష్క లేటెస్ట్ మూవీ 'రుద్రమదేవి' విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ మూవీని డిసెంబర్ మూడవ వారంలో విడుదల చేయాలి అనుకున్నారు.

అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. ముఖ్యంగా ఎడిటింగ్, గ్రాఫిక్స్ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి. ఈ ఆలస్యం కారణంగా సినిమాను అనుకున్న సమయంలో విడుదల చేయలేము అని యూనిట్ భావిస్తోంది. ఇక డిసెంబర్ నాల్గవ వారంలో హడావుడిగా

విడుదల చేసే బదులుగా, పనులు పూర్తిగా క్వాలిటీతో చేసుకుని సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

పోస్ట్ ప్రొడక్షన్ పనులకు చాలా సమయం పడుతుందని ముందుగా ఊహించే, షూటింగ్ జరుగుతుండగానే కొన్ని విభాగాల పోస్ట్ ప్రొడక్షన్ ప్రారంభం అయింది. డబ్బింగ్ పనులు కూడా షూటింగ్ పూర్తవగానే వేగవంతం చేశారు. అయితే భారీ గ్రాఫిక్స్, ఎఫెక్టుల వల్ల

ఆలస్యం జరుగుతోంది. ఎంతో కష్టపడి తీసిన సినిమాకు అంతకంటే ఎక్కువ కష్టపడి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నారు. ఈ తుది మెరుగులు దిద్దితే సినిమా పూర్తయినట్లే.

దాదాపు 9సంవత్సరాల పాటు రీసెర్చ్ చేసి మరి సినిమాను తెరకెక్కిస్తున్న డైరెక్టర్ గుణశేఖర్ ఈ ప్రాజెక్టు కోసం భారీగా డబ్బులు ఖర్చుపెడుతున్నారు. దాదాపు యాబై కోట్ల వరకు బడ్జెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దేశంలోనే తొలిసారిగా స్టీరియో స్కోపిక్

తో 'రుద్రమదేవి' 3డీలో షూట్ చేశారు. ప్రత్యేకంగా నగలు డిజైన్ చేయించటంతో పాటు, భారీ సెట్టింగులు వేసి షూటింగ్ చేశారు. ఈ మూవీ కథ తెలంగాణకు సంబంధించినది కావటంతో ఆ రాష్ర్టంలో పన్ను మినహాయింపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్

సుముఖత వ్యక్తం చేశారు.

అనుష్క లీడ్ రోల్ గా వస్తున్న లేడి ఓరియంటెడ్, హిస్టారిక్ మూవీ ఇది. ఈ ప్రాజెక్టు అరుంధతి కంటే పెద్దహిట్ అవుతుందని సినీ ప్రముఖులు చెప్తున్నారు. అనుష్కతో పాటు రానా ప్రధాన పాత్రలో ఉన్నారు. అటు అల్లు అర్జున్, కృష్ణం రాజు, నిత్య మీనన్, కేథరిన్,

హంసా నందిని, ప్రకాష్ రాజ్ తదితరులు ముఖ్య క్యారెక్టర్లు పోషిస్తున్నారు. హిస్టారికల్ ప్రాజెక్టుకు మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. నాటి రుద్రమ వీరనారిగా నిలిస్తే, ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న ఈ రుద్రమదేవి పోటిలో ఉన్న సినిమాలతో ఏ

మేరకు యుద్ధం చేస్తుందో చూడాలి.

For More Latest Updates about Telugu News, Movie News, Gossips, Reviews and Gallery Logon to teluguwishesh.com

Rudramadevi Release PostponedWhere stories live. Discover now