chapter -13

84 6 2
                                    

అమృత  రెడీ  అవుతూ ఉంటుంది. ఒకసారి మిర్రర్ దగ్గర  తనని తాను చూసుకుని ఓకె అనుకుని  , స్కూటీ లో ఆఫీస్ కి బయలుదేరుతుంది.

తను వెల్లాలనుకున్న ఆఫీస్ రాగానే , స్కూటీ పార్క్ చేసి , లోపలకొచ్చి , రిసెప్షన్ లో
అడుగుతుంది.

రెసెప్నిస్ట్ వెళ్ళాస్లిన ఫ్లోర్ చెప్పడం తో  , ఆ ఫ్లోర్ కీ
వెలుతుంది. అక్కడ  మనేజర్ ని కలవమని రూం చూపిస్తారు .

మేనేజర్ రూం కెళ్ళి సర్ అని పిలిచి , తనచేతిలో ఉన్న లెటర్ చూపిస్తుంది.

మేనేజర్  డీటైల్స్ అన్ని చెక్ చేసి ,అమృత మీకు ఓన్ వీక్ పాటు ట్రైనింగ్ ఉంటుంది. తర్వాత వర్క్ ఇవ్వడం జరుగుతుంది అని  ,  ఆ  ప్లేస్ చెప్పి పంపిస్తాడు .

అప్పటికే కొంతమంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు . బ్లూ కలర్ కుర్తి సెట్ వేసుకుని , దుపట్టా సైడ్ కి వదిలేసి , వైట్ స్కిన్ టోన్  , పోనీటైల్  తో నడిచి వస్తుంటే , వాళ్లంతా తకేసి చూస్తూ  ఉంటారు .

వచ్చింది కరెక్ట్  ప్లేసా కాదా అని కన్ఫర్మ్ చేసుకుని
వాళ్ళతో జాయిన్ అవుతుంది అమృత.

వాళ్ళ ప్రాజెక్ట్  లీడ్ వచ్చి చెప్తూ ఉంటే , చాలా ఫోకస్ గా వింటూ నోట్ చేసుకుంటోంది అమృత.

అప్పుడే ఆఫీస్ కీ వచ్చిన మాధవ్ , ప్రైవేట్ లిఫ్ట్ లో తన ఛాంబర్ కి వెళ్లి , అక్కడ చెయ్యాస్లిన
వర్క్ ఫినిష్ చేసుకుని , అర్జెంట్ మీటింగ్ ఉంటే బయటి కి వెళ్లిపోతాడు.

ఫస్ట్ డే అవ్వడం తో  ఎక్కువ వర్క్ లేక తొందరగా వెళ్లిపోతుంది అమృత.

చెయ్యాస్లిన వర్క్ ఇంకా ఉండడం తో ,  మాధవ్ మళ్ళీ ఆఫీస్ కీ వచ్చి పనిలో పడిపోతాడు .
పని పూర్తి అయ్యేసరికి రాత్రి 10 గం దాటిపోతుంది. అప్పుడు ఇంటికి వెళతాడు.

అలా   అమృత కి ట్రైనింగ్ లోను ,
మీటింగ్స్ , వర్క్ తో మాధవ్ కి  వీక్ అంతా
గడిచిపోతుంది.

వీక్ ఎండ్.

సాటర్డే అవ్వడంతో మూవీ కి వెళ్దాం అని అంటుంది ప్రియ.

అర్జున్ కి కాలేజ్ లో ,స్పోర్ట్స్ టోర్నమెంట్ ఉందని ,రాలేనని వేలిపోతాడు.

చూసి చూడంగానేWhere stories live. Discover now