chapter - 16

86 5 2
                                    

మాధవ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు , అమృత చుట్టూ చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

అమృత ని  అలా చూసి బా అనిపిస్తుంది మాధవ్ కి.

అలా చాలా దూరం తీసుకెళ్తాడు . సిటీ ఔట్కట్స్ దాకా తీసుకెళ్ళి, మళ్ళీ రింగ్ రోడ్ మొత్తం తిప్పుతాడు .

కార్ అద్దాలు కిందకి దించేసి చల్లటి గాలిని ఫీల్ అవుతూ దానికి అనుగుణంగా మ్యూజిక్ వింటూ ఉంటుంది అమృత.

మాధవ్ ఇంట్రెస్ట్ గా కార్ ఇంకా స్పీడ్ గా  డ్రైవ్ చేస్తాడు.

దుర్గంచెరువు ఫ్లైఓవర్ మీదకి తీసుకొస్తాడు , స్ట్రీట్ లైట్ వెలుతురులో, చుట్టూ  హై రైస్ బిల్డింగ్స్ ని  చూస్తూ ఆ వెదర్ ఫారిన్  లా కనిపిస్తుంటే ,
అలా చూస్తూ ఉండిపోతుంది అమృత.

కార్ ని ఒక పక్కకి ఆపు తాడు మాధవ్.

వెంటనే కార్ లోచి జంప్ చేసినట్లే దిగుతుంది అమృత.

జాగ్రత్త మనం ఇక్కడకి జంప్ చెయ్యడానికి రాలేదు అంటాడు మాధవ్.

అమృతకి  ఎక్కడ వినిపిస్తాయి ఆ మాటలు ,
చిన్న పిల్ల అయిపోతుంది . మధ్య రాత్రి , చుట్టూ  లైట్స్ , చల్లటి గాలి వావ్ అనుకుంటూ నడుస్తుంది

కార్ కి ఆనుకుని నిలబడి చూస్తుంటాడు
అమృత ని , చాలా హ్యాపీ గా అనిపిస్తుంది మాధవ్ కి.

చాలా దూరం వెళ్లి ,వెనక్కి తిరిగే సరికి  దూరం గా నించున్న  మాధవ్ కనిపిస్తాడు.

పరిగెత్తి నట్టే నడుచుకుంటూ వచ్చి మాధవ్. ..అని పిలుస్తూ తన మెడ చుట్టూ చెయ్యేసి చెంప మీద గట్టి గా.... ముద్దు పెట్టి. కళ్ళు పెద్దవి చేసి నేను చాలా హ్యాపీ అని చెప్తుంది.

( ఆ ప్లేస్ అంత నచ్చింది మన అమృత కి.
నచ్చిన ప్లేస్ లో నచ్చిన మనిషి పక్కనుంటే మనసు మాట వింటుందా , అలాగే అమృత కూడా)

మాధవ్ ఆశ్చర్యంగా  చూస్తూ ఉంటాడు
ఎక్స్పెక్ట్ చెయ్య లేదు , అమృత ముద్దు పెడుతుందని.

వెంటనే  తన నడుము చుట్టూ చెయ్యేసి టైట్ గా హగ్ చేసుకుంటాడు. కాసేపటికి మాధవ్ చెయ్యి పట్టుకుని పక్కనే నడుస్తూ ఉంటుంది.

నచ్చిందా ఈ ప్లేస్ అడుగుతాడు.

చాలా , అని చెప్తుంది.

ఇదేనా చూడ్డం అడుగుతాడు.

అవును అంటూ చుట్టూ ఉన్న హై రైస్ బిల్డింగ్స్  నీ చూస్తూ అంటుంది. మళ్ళీ తనే మాట్లాడుతూ , ఫ్రెండ్స్ మాటల్లో వినడమే కానీ ఇదిగో ఇప్పుడే చూడం అంటుంది.

ఒక మంచి ప్లేస్ చూసుకుని కూర్చుంటారు.
మాధవ్  భుజం మీద తల వాల్చి కూర్చుంటుంది అమృత.

ఎప్పటినుంచో అనుకుంటున్నాను ,
నువ్వు నాకోరిక తీర్చేసావ్ అంటుంది.

నీతో ఉండాలనిపించింది అందుకే ఇలా అంటాడు

పక్కనే ఒక  రెస్టారెంట్ ఉంది  వెళ్దాం అని తీసుకెళుతుంది.

అక్కడ టొమాటో బజ్జి ఆర్డర్ చేసి పక్కగా నుంచుంటారు.
రెండు ప్లేట్ లో బజ్జి లో మద్యన ఉల్లిపాయముక్కలు  వేసి వాటి మీద నిమ్మరసం పిండి ఉప్పు , కరం చల్లి ఇస్తాడు .

తీసుకుని తింటుంటారు ఇద్దరూ ,

బావుంది కదా అంటుంది.

హు... టొమాటో బజ్జి అంటే  ఎలావుంటుందో అను కున్నాను కానీ బావుంది అంటాడు.

చాలా సేపు స్పెండ్ చేసిన తర్వాత, ఎర్లీ మార్నింగ్
అమృత ని ఇంట్లో దించి వెలిపోతాడు మాధవ్.

అమృత ఇంట్లో కొచే సరికి ఇంకా పడుకునే ఉంటారు అందరూ. ఇంక తన రూంలోకి వెళ్లిపోతుంది అమృత.

               ...................................

చూసి చూడంగానేWhere stories live. Discover now