chapter -19

62 6 2
                                    

కొబ్బరాకులతో,  అల్లిన  పే....ద్ద  పందిరి ముందు ఆగిన కార్ లోంచి, దిగారు నారాయణ వాళ్ళు.

పే... ద్ధ ఇల్లు, చుట్టూ పచ్చని చెట్టు, ఇల్లంతా
బంతి పూలతో అలంకరించారు .

అప్పుడే వచ్చిన నారాయణా వాళ్ళని గుర్తు పట్టి, లోపలకి తీసుకెళ్లారు. రెడీ అయ్యి వచ్చేసరికి.

అప్పటికే మొదటిరోజు చెయ్యాస్లిన పూజ మొదలు పెట్టేశారు .గణపతి హోమం చేస్తున్నారు.

తెలిసున్న బంధువులతో , మాట్లాడుతున్నాడు నారాయణ, నర్మద అమృత తెలిసున్నవాల్లని పలకరించేసి , వాళ్ళతో పాటు హెల్ప్ చేస్తున్నారు.
అంజలి తనలాంటి వాళ్ళని చూసుకుని వాళ్ళతో
కలిసిపోయింది.

అలా మొదాటి రోజు , బంధువుల హడావిడితో
సందడితో, గడిచిపోయింది.

రెండో రోజు , ఆయుష్కామన యజ్ఞం చేస్తున్నారు.
తూర్పు దిక్కు న ,తెల్లని వస్త్రం పరిచి , 12 గీతాలు గీశారు నిలువుగా, అడ్డంగా 5గీతాలు గీసి
మొత్తం 60 గదులు వచ్చేలా చేశారు. బియ్యంపోసి , కలశాన్ని స్థాపించారు.

సంవత్సర దేవతలను , తిథి దేవతలను అవహన చేసి పూజ స్టార్ట్ చేసారు.

ఇవి చేసేసరికి చాలా టైం పట్టింది.

పూజ అంతా అయ్యేసరికి లంచ్ టైం దాటిపోయింది.

భోజనాలు చేసే సరికి , అందరూ అలిసిపొడంతో
రెస్ట్ తీసుకోడానికి వెళ్లిపోయారు. ఆ రోజు అలా గడిచిపోయింది.

3 రోజు కలసాభిసేకం చేస్తున్నారు.
అంజలి వాళ్ళకి , ఇదే ఫస్ట్ టైం విలేజ్ రావడం.
వస్తున్నప్పుడు దారిలో , పచ్చని చెట్లు , పంటపొలాలు  చూసి , ఊరంతా చూడాలనిపించి,
అక్కడున్న మిగతా బ్యాచ్ తో అమృత , అంజలి
వెళ్లిపోయారు. ఆరోజు కూడా అలా గడిచిపోయింది .

4 రోజు పెద్దగా ఎంలేవు వాల్ల ఇష్ట దేవత పూజ ఏదో చేసుకుంటున్నారు అలా ఆ రోజుకూడా వెళిపోయింది.

5,రోజు వివాహం అన్నమాట ,60y దాటినందు వల్ల వాల్ల పిల్లలంతా కలిసి సరదాగా అందరి బంధువులతో కలిసి చేసుకోవాలని కోరిక.

ఈరోజుతో అన్ని పూర్తి అయిపోతాయి.
ఇంక రెండు రోజుల్లో ప్రయాణం అని,
చుట్టు పక్కల ఊర్లు కూడా చుసొస్తం అని అంజలి , అమృత మిగతా గ్యాంగ్ తోపాటు వెళ్లిపోయారు.

అందరూ చక్కగా పట్టు బట్టలు కట్టుకుని , ఆడవాళ్ళందరూ లక్ష్మి దేవిలా, అమ్మాయిలందరూ
కుందనపుబొమ్మల్లా రెడీ అయ్యారు.

ఇంక మగవాళ్ళు పంచ కండువా , అబ్బయిలందరూ కుర్తా పైజమా, ఇలా చాలా కలర్ ఫుల్ గా, ఉంది ఇల్లంతా .

ఇంక అమృత అయితే గ్రీన్ కలర్ పట్టు లంగాలో
మెరూన్ కలర్ హాఫ్ సారీ లో బంగారుబొమ్మలా
ఉంది.

భోజనం అయిపోయాక నారాయణ వాళ్ళ బంధువులతో మాట్లాడుతున్నాడు.
అప్పుడే , అందులో ఒకతను  వాల్లబ్బాయికి
అమృత ని ఇమ్మని అడుగుతాడు.

మొదట ఒప్పుకోడు, అక్కడున్న పెద్దవాళ్ళు గట్టిగా చెప్పడం తో సరే అనేస్తాడు.

ఒకసారి అమ్మయి ని కూడా కనుక్కుంటే ,
మనం తర్వాత చెయ్యస్లివి చూసుకుందాం అంటాడు అవతల వ్యక్తి.

లేదండీ , అమ్మాయిని అడగాస్లిన అవసరం లేదు.
నా పిల్లలు నా మాట కాదనరు ఎంచెప్పినా వింటారు.

మీరు మిగతాపనులు చూడండి అని అంటాడు
నారాయణ.

సరే అండి మంచి ముహూర్తం చూసుకుని, మిగతా మాటలు మాట్లాడుకుందాం , అని వెళ్లిపోతారు.

చూసి చూడంగానేWhere stories live. Discover now