chapter -27

74 7 2
                                    

మాధవ్ అమృత రూం లోకి వచ్చి , అమృత నీ చుట్టుకుని పడుకుంటాడు. నిద్దట్లో నే అమృత మాధవ్ కి ఇంకొంచం దగ్గరకి జరుగుతుంది.

అంజన రూం లోకి వచ్చేసరికి , మధుసూదన్ ,వాష్ రూం నుంచి వస్తూ.. కనిపిస్తాడు. మధుసూదన్ దగ్గరకి వచ్చి , మాధవ్ తో , మాట్లాడావా.. అని మొహం లోకి చూస్తుంది. ఏమైనా చెప్తాడేమోనని .

మధుసూదన్ ,  సైలెంట్గా ఉంటాడు.

నిన్నే మధు అడిగితే ఎం చెప్పవేంటి, మాధవ్ కూడా అలాగే వెలిపోయాడు. నువ్వు కూడా ఎం చెప్పట్లేదు. చెప్తావా ... లేదా.. అని అడుగుతుంది.

ఎం చెప్పాలి అంజనా..  అని మాధవ్ , చెప్పిందంతా చెప్తాడు.

నువ్వేం అడక్కుండా సైలెంట్ గా ఇలా వచ్చేసావ్ ఎంటి..

మాధవ్ చిన్న పిల్లాడు కాదు, అన్ని నిర్ణయాలు
సమర్థవంతంగా ఆలోచించి తీసుకునే తెలివితేటలను వాడికి ఉన్నాయి.

ఎంత వాడు తెలివైన వాడైనా మనకి కూడా కొన్ని కోరికలు , ఆశలు ఉంటాయి కదా మధు అంటుంది.

అంజనా ఇప్పటిదాకా నా టైం అంతా బిజినెస్ డెవలప్ చెయ్యడం లోనే పెట్టేసాను.
ఇప్పుడిప్పుడే మీ అందరితో గడిపే టైం దొరికింది.
ఇప్పుడు మాధవ్ మీద గొడవ పడి వాడిని దూరం చేసుకోవడం ఇష్టం లేదు . అన్ని ఆలోచించే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. తొందరగా పడుక్కో
రేపు నారాయణ ని కలవడానికి వెళ్దాం..అంటాడు

అంటే మధు నువ్వేమంటున్నావ్.

వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్ళి చేద్దాం అనుకుంటున్నాను.ఆ విషయమే రేపు నారాయణతో మాట్లాడ్డానికి వెళ్తున్నాం మనం అంటాడు.

ఇంక అమృత అంటావా.. మన మాధవ్ కి తగ్గ అమ్మాయి, ఎం తక్కువ అమ్మాయిలో,
నువ్వు కూడా మధవ్ కి పెళ్ళి చెయ్యాలనే అనుకుంటున్నావు కదా ... అంటాడు.

ఏదో ఆలోచిస్తున్నట్లు గా మధుసూదన్ కేసి చూస్తుంది అంజన .

ఇంకేం ఆలోచించకుండా పడుకో అంజనా అంటాడు.

అంజనా కూడా మధు  ఆలోచించాడంటే అది కరెక్టగానే  ఉంటుంది అని ఆనుకుని ఇంకేం మాట్లాడకుండా .. పడుకుండిపోతోంది.

చూసి చూడంగానేWhere stories live. Discover now