వారం రోజులకి ప్రసాద్ హాస్పటల్ నుంచి విడుదలయ్యాడు. పూర్తిగా స్వస్థత చిక్కింది. ఇంటికి తిరిగి వచ్చిన రెండు రోజులకి రజని యిల్లువదలి పెట్టింది. ప్రసాద్ వారించేడు వద్దన్నాడు. కాని రజని వినలేదు. ఇంటిలో వుండటానికి అభ్యంతర మేముంది రజని? సహజీవనం లేకపోయినా నహచర్యం మిగిలే వుందికదా? అన్నాడు.
"అభ్యంతర మేమి లేదు ప్రసాద్. కాని మన యిద్దరి జీవితాల్లోనూ ఒక అధ్యాయం ముగిసిపోయింది. నూతన అధ్యాయాన్ని నూతన ప్రదేశంలోనే ప్రారంభించాలని నా కోరిక" అంది రజని.
"కనీసం యిదయినా చెప్పి వెళ్లు రజనీ నువ్వు ఎక్కడకువెళ్లుతున్నావు?" అన్నాడు ప్రసాద్.
"లోడి రోడ్డులో ఒక చిన్న యిల్లు కాస్తచవుకగా దొరుకుతుంది. ముప్పై రూపాయిలు అద్దె. చౌకే కదూ!" అంది రజని.
రజని మాటలు ప్రసాద్ కి ఎంతో బాధకలిగించాయి. అయినా ఏమీ మాట్లాడలేదు. రజనితత్వం అతనికి మొదటి నుంచి తెలుసును, ఆమె ఒక నిశ్చయానికి వచ్చిన తరువాత ఆది యిక ఏమాత్రమైన కదిలించడమనేది అసంభవం.
"కారులో దించివస్తాను పద రజనీ!'' అన్నాడు ప్రసాద్ ,
"వద్దు ప్రసాద్. ఇప్పటి నుండి నాకు జీవితమందు తీపికలుగుతోంది. అది మొదట్లోనే త్వజించబడటం నాకు యిష్టం లేదు" అంది రజనీ నవ్వుతూ.
"అదిసరే రజనీ నీ సామానుఏది?" అన్నాడు ప్రసాద్ నవ్వుతూ.
"ఇదుగో ప్రసాద్, యీ రెండు పెట్టెలు, బెడ్డింగు మొదటిసారి వచ్చినప్పుడు నాతో తెచ్చుకున్నాను. అవే తీసుకు వెళ్తున్నాను" అంది.
"అయితే యిక వెళ్ళు రజనీ" అన్నాడు ప్రసాద్ దీర్ఘంగా నిట్టూర్చి.
రజనీ ఆ మరుసటి దినం నుంచి వుద్యోగంలో కూడా చేరింది. ఆమె అందాన్ని చూచి ఒక ప్రయివేట్ కంపెనీలో రెసెప్షనిస్ట్ వుద్యోగం ఆ కంపెనీ యజమాని యిచ్చాడు. రెండువందల రూపాయిలజీతం. ఒక నెల అడ్వాన్స్ జీతం కూడా యిచ్చాడు. వాటితో యింటికి కావలసిన సామానులన్నీ ఖరీదు చేసింది. ఆనాడు సాయంకాలం రజని రామం లాడ్జికి బయలుదేరింది. లాడ్జికి వెళ్ళేటప్పటికి రామం గది తాళం వేస్తున్నాడు. రజనీని చూచి ఆనందంతో సరిగ్గా నీవద్దకే బయలు దేరి వస్తున్నాను రజనీ" అన్నాడు.
YOU ARE READING
అప్రాశ్యులు
Romantizmఅరవైఏళ్లనాటి ఈ 'స్త్రీ' నవల ఈనాటి అతివకి ప్రతిబింబం. రజని ఆత్మనిర్భరత అసాధారణమయితే ఆమె చంచల ప్రవృత్తి అనూహ్యగోచరం. కమల పాతివ్రత్యసంకల్పం అఖుంటితమయితే ఆమె లోనయిన పరపురుషాకర్షణ ప్రకృతిచిత్తం. విశాల ఉదార సేవాభావం దైవత్వమయితే ఆమె చూపే అపార ప్రేమానురాగ...